10 డిసెంబర్ 2008

**** సాయి చిత్రమాలిక *****

* * * శివోహం * * *



05 డిసెంబర్ 2008

* * * ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమః * * *

------------------------భక్త వినతి --------------------------
--------------- ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమః ---------------
పరిశీలించు పెద్దలకు పఠించు పండిత పామర జన వంద్యులకు పాదాభివందనములు జేయుచు చేసుకొనుచున్న చిన్న విన్నపము.
మహాత్ములార! నేను తెలుగు సంపూర్ణముగా తెలిసిన వాడిని కాను. లోక నియమాల సారముల నెరిగిన గునవంతుడను కాను.పరమాత్మ తత్వమును పరిపూర్ణముగ గుర్తించిన భక్తప్రవరుడను ఏమాత్రము కాను .కేవలము . కేవలము సామాన్య మానవుడను .అనుకోని నిర్ణయ ఫలితమో లేక శ్రీ సీత రామచంద్ర స్వామి నిర్ణయమో గాని నేను కొంత కాలము పవిత్ర గోదావరి తట పుణ్య క్షేత్రమైన శ్రీ భద్రాచలమున పదునాలుగు నెలల కాలము నివాస మున్నాను. ఆ సమయాన అద్భుతముగ ఆ స్వామి సంకల్పమమేమిటో గాని రక్త మాంస నిర్మితమైన ఈ శరీరాధారముగ తప్పు తప్పు ఈ శరీరము పాత్రగ జేసి శ్రీ భద్రగిరి శతకము రాయించినాడు.కళ స్వామిదే కల్పన స్వామిదే.ఈ శరీరమును పాత్రగా మలచి తాను గడించు కొన్న సంపద ఈ శతకము . ఈదివ్య శతకము అచ్చు వేయించ దలచాను గాని లక్ష్మీ కటాక్షము లభించందున ఆ పని చేయలేదు కాని ఈ బ్లాగు ను ఆవిర్భావ ఫలితముగ దీనినిచ్చట భద్రముచేయుచున్నాను. కాన ఇందులో ఏవేని దోషములు సంభవమైన సరి జేయ ప్రార్థన

*****************************************
*******************సుధా సత్య నారాయణ గౌడ్.బి

* * * శ్రీ భద్రగిరి శతకము * * * 1

:- శ్రీ కాంతుడు రాముండై భూకాంతగ సిరియు మార భూక్షేత్రమునన్ ! ఏ కాంతము గోరియు హరి బ్రాకటముగ వెలసెనిచట భళి భద్రగిరీ !!
భా:- ఓ భద్ర మహర్షీ! శ్రీ మహా విష్ణువు శ్రీ రామునిగా,లక్ష్మీదేవి సీతగా అవతరించి ఏకాంతము కోరుకొని దివ్యమైన నీ పర్వతశిఖరము పై కొలువు తీరియున్నారు గదా.

20 అక్టోబర్ 2008

హనుమత్శతకం (రచయిత.. అంజయ్య గౌడ్ )1

పద్యం:- అంజన్యాత్మజ శాత్రవ భంజన భాస్కరుని శిష్య భక్త ప్రవరా !
ముంజేయోడ్చియు మీపదకంజములను గొల్చుచుంటి గావవె హనుమా!!
భావం :- అంజని మాత పుత్రుండవైన ఆంజనేయ ! నీవు శత్రువుల నాశానం జేయువాడవు. సూర్యుని వద్ద సకల శాస్త్రముల చదివినవాడవు. భక్తాగ్రేసరుడవు . అటువంటి నీయొక్క చరణముల సేవించుచున్నాను
నన్ను కాపాడు తండ్రీ .